Natyam ad

పోలీసులకు ధూళిపాళ్ల పిర్యాదు

గుంటూరు ముచ్చట్లు:

సోషల్ మీడియా ప్రచార మాధ్యమాలలో నిన్న శుక్రవారం విజయవాడలోని డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తానని తాను అనని మాటలు అన్నట్లు తనపై అసత్య ప్రచారం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల, ఎమ్మెల్యేల, పీఏలు తన ఫోటోలతో మార్ఫింగ్ చేసి తప్పుడు కథనాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నంలో భాగంగా ప్రచారం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ధూళిపాళ్ల మాట్లాడుతూ జనసేన టిడిపి పార్టీల మధ్య పొత్తు ఖరారు అయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైందన్నారు. అధికారం కోల్పోతామని నిరాశ నిస్పృహలతో కులవిద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగున్నరలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించిందన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు.

 

 

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళితులను హింసించి, నోరునొక్కి చిత్రహింసలకు గురి చేశారని విమర్శించారు. దళితుల రక్తంతో తడిసిన చేతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారని మండిపడ్డారు. తనపై ప్రసార మాధ్యమాలలో అసత్య ఆరోపణల ప్రచారం వెనుక మంత్రి సీదిరి అప్పలరాజు పిఏ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సోషల్ మీడియా సిబ్బంది ఉన్నట్లు ధూళిపాళ్ల ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ధూళిపాళ్ల పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి టిడిపి శ్రేణులతో కలిసి ర్యాలీగా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

 

Post Midle

Tags: Complaint of litterers to the police

Post Midle