Complaint on 60 acres of government land to Sanghamitra

సంఘమిత్రకు 60 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఫిర్యాదు

Date:27/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని నేతిగుట్లపల్లె పంచాయతీలో నివాసం ఉంటు , సంఘమిత్రగా పనిచేస్తున్న చిన్నప్ప కుటుంబం 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ రికార్డులలో మార్చి , పట్టాలు చేసుకున్నారని ఆరోపిస్తూ ఆ గ్రామ బీసీలు, దళితులు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆ గ్రామస్తులు వెంకట్రమణ, రమణప్ప, శంకర, రమేష్‌బాబు ఆధ్వర్యంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులను కలసి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి రాత మూలకంగా విలేకరులకు ఫిర్యాదు ప్రతులు అందజేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు నేతిగుట్లపల్లె గ్రామంలో బీసీలు, దళితులకు చెందిన సుమారు 60 ఎకరాల భూములను కబ్జా చేసి, చిన్నప్ప, ఆయన భార్య శారదమ్మ పేరున 1-బి రికార్డులు మార్చుకున్నారని ఆరోపించారు. అలాగే సర్వేనెంబరు:239/5, 239/2 లో గల 2-42 ఎకరాల భూమిని మార్చుకుని హంద్రీనీవా కాలువలో భూమి ప్రభుత్వం తీసుకోకున్న, తీసుకున్నట్లుగా రికార్డులు మార్చి , లక్షలాది రూపాయలు స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే చిన్నప్ప కుమారుడు హరినాథ్‌ తహశీల్ధార్‌ కార్యాలయంలో పనిచేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని , వీరిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తహశీల్ధార్‌ వివరణ…

ఈ విషయమై విలేకరులు తహశీల్ధార్‌ వెంకట్రాయులను వివరణ కోరగా గ్రామస్తులు ఫిర్యాదుపై విచారణకు ఆదేశించామని, విచారణ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు పంపి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కరోనాను నియంత్రించేందుకు ప్రజలు అవగాహన పెంచుకోవాలి

Tags: Complaint on 60 acres of government land to Sanghamitra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *