Complaint to Commissioner Sridhar on issues

సమస్యలపై కమిషనర్ శ్రీధర్ కు వినతి

-జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు దొడ్డి రమణ

Date:20/01/2020

గాజువాక ముచ్చట్లు:

గాజువాక నియోజకవర్గం జివిఎంసి పరిధిలో నూతనంగా మార్చబడిన 65 వ వార్డులో ఉన్న సమస్యలపై జోన్-5 కమిషనర్ శ్రీధర్ కి వినతి పత్రం జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు దొడ్డి రమణ అందజేసి, గాజువాక 65వ వార్డ్ పరిధిలో ఉన్న వేంబో కాలనీ, సంజీవ్ నగర్ కాలనీ, భానోజీ తోట పలు ప్రాంతాలలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, వీధిలైట్లు సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం తెలుసుకొని వారి సమస్యలను వెంటనే తీర్చాలని ఉద్దేశంతో  గాజువాక జోన్-5 కమిషనర్ శ్రీధర్ ని కలిసి ప్రజలు పడుతున్న సమస్యల గురించి వివరించారు. వెంటనే స్పందించిన కమీషనర్ కాలనీలో సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాంబో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మంత్రి మంజుల, బొత్స వాసు , కొమ్ము సతీష్, రఘునాథ్, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

వేగంగా వాహనాలు నడిపి కుటుంబాలను వీధినపడేయకండి

Tags: Complaint to Commissioner Sridhar on issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *