ఎంఈవో వేదింపులపై మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు

Complaint to Minister Peddi Reddy on MEO threats

Complaint to Minister Peddi Reddy on MEO threats

– బదిలీ చేయాలని ఆదేశాలు

Date:10/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండల విద్యశాఖాధికారి లీలారాణి ఉపాధ్యాయులను వేదిస్తోందని ఇషా శిక్షణా తరగతుల నిధులు దుర్వినియోగం చేసిందని ఎస్టీయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రెడ్డెప్ప, నారాయణ, అయూబ్‌, కిషోర్‌, మురళి, శంకర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. విద్యశాఖాధికారి నిర్లక్ష్యంగా ఉపాధ్యాయులను మాట్లాడటం, వేదించడం చేస్తున్నారని , 2017 లో జరిగిన ఇషా శిక్షణా తరగతుల నిధులు జిల్లా అంతట ఉపాధ్యాయులకు పంపిణీ చేసినా పుంగనూరు మండలంలో నిధులు ఇవ్వకుండ అక్రమాలకు పాల్పడ్డారని, అడిగితే దురుసుగా మాట్లాడుతారని సదుంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు లేకుండ చేస్తామని ,అవినీతి, అక్రమాలను సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎంఈవోను తక్షణం బదిలీ చేయాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్‌, ప్రభాకర్‌, బుడ్డన్న, మనోహర్‌, మంజునాథ్‌, సుధాకర్‌, నరేంద్ర, గురుప్రసాద్‌, నారాయణస్వామి , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కారు బోల్తా…ఇద్దరు మృతి

Tags; Complaint to Minister Peddi Reddy on MEO threats

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *