పట్టు పరిశ్రమ అభివృద్ధి ఏర్పాటు కొరకై ఏడికి ఫిర్యాదు

అమరావతి ముచ్చట్లు:

బహుజన యువసేన బివైస్ ఆధ్వర్యంలో స్థానిక సిరికల్చర్ ఆఫీసులో సిరికల్చర్ ఏడి సరోజ కి పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందుటకు రీలింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు కొరకై ప్రభుత్వం కేటాయిస్తున్న స్థలాలలో అర్హులకు కేటాయించకుండా అనార్హులకు కేటాయించడంపై సిరికల్చర్ ఏడి కి ఫిర్యాదు చేయడం జరిగింది, ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందుటకు రీలింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు కొరకై ప్రభుత్వం కొంత స్థలాన్ని సిరికల్చర్ ఎలిజిబిలిటీ గ్రేటీరియా ప్రకారం మొదటిగా రీలింగ్ వృత్తి చేస్తున్న వారికి ప్రాదనమిస్తూ ఎక్స్పీరియన్స్ ను బట్టి ప్రాధాన్యమిస్తూ ఎవరికైతే ఇదివరకు సొంత రీలింగ్ షెడ్యూల్ కలిగి ఉండరు వారిని అనరులుగా గుర్తించి స్థలాలు కొరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రతిగాముకంగా నోటిఫికేషన్ ఇస్తూ లేదా నోటీసు బోర్డులో నోటిఫికేషన్ పెడుతూ దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అధికారులు మండల రెవెన్యూ అధికారి టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వారు సమక్షంలో ఎంతమందైతే ఎంటర్ప్రైజ్ దరఖాస్తు చేసుకొని ఉంటారో వారందరి ముందర లక్కీ టిప్ ద్వారా స్థలాలు కేటాయించడం, 75 శాతం ప్రభుత్వం చెల్లిస్తూ, 25% బెనిఫిట్ దగ్గర తీసుకొని స్థలం కేటాయించడం ప్రభుత్వ పరమైన చర్య అని, కానీ ఇలాంటి ప్రక్రియ జరక్కుండా గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబుతారో వారికి అవినీతికి పాల్పడి DSO రాజశేఖర్ రెడ్డి  అనరులైన వారికి ఇదివరకే సొంతంగా యూనిట్లు ఉన్నవారికి, రీలింగ్ అండ్ ట్విస్టింగ్ పనికి సంబంధం లేని వారికి స్థలాలు కేటాయిస్తూ ఫిబ్రవరిలో ఒక లిస్టును విడుదల చేసి వారికి లీజ్ అగ్రిమెంట్లు చేస్తుండగా బాధితులతో కలిసి వారిని అడ్డుకొని, నిరసన తెలుపడం జరిగిందని పునీత్ అన్నారు, దానిపై డీఎస్ఓ కి, సిరికల్చర్ కమిషనర్కి , కలెక్టర్కి, ఏడి కి కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని, అప్పుడు డిఎస్ఓ మేము ప్రస్తుతానికి ఈ ఈ కార్యక్రమం ఆపేస్తున్నామని, ఒక కమిటీ ద్వారా విచారణ జరిపి, అనర్హులు ను గుర్తించి, వారిని లిస్ట్ లో నుండి తొలగిస్తూ, అర్హులైన వారిని లిస్టులోకి చేరుస్తూ లిస్టును తయారు చేస్తామని డీఎస్ఓ  చెప్పడం జరిగిందని, కానీ ఎలాంటి విచారణ జరపకుండా, ఐదు రోజుల క్రితం ఎవరికైతే అనర్హులు లిస్టులో స్థలం కేటాయించారో వారితోపాటు సిరికల్చర్ అధికారైన రవి నాయక్ వెళ్లి స్థలాన్ని క్లీన్ చేయడం జరిగిందని, ఎందుకు క్లీన్ చేస్తున్నారని అడిగిన బాధితులపై జీవి రమణ, అశోక్, రామాంజులు తదితరులు దాడికి ప్రయత్నించగా, అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు వెళ్లి ఇరవర్ని పంపించడం జరిగిందని, తరువాత ఎవరైతే అనర్హులు ఉన్నారో వారు బాధితులపై తప్పుడు కేసు పెట్టి బాధితులను పోలీస్ స్టేషన్కు పిలిపించి, టూ టౌన్ సిఐ వారికి సిరికల్చర్ ఆఫీసు నుండి ఆదేశాలు ఉన్నాయని, ఆదేశాల ప్రకారం వారు క్లీన్ చేసుకుంటారని, బాధితులు ఎవరైనా ఉంటే డీఎస్ఓ గారికి కానీ సిరికల్చర్ ఆఫీసులో గానీ ఫిర్యాదు చేసి వారి సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పగా, ఈరోజు సిరికల్చర్ ఆఫీసులో ఏడి గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని పునీత్ అన్నారు, అలాగే గతంలో ఉన్న అధికార నాయకుల ద్వారా, వారి అండతో అవినీతికి పాల్పడి ప్రభుత్వ నియమ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా అనరులకు స్థలాలు కేటాయించడం కరెక్ట్ కాదని, విధులు బాధ్యతగా నిర్వహించని ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్సీకే వేటు తప్పలేదని, వారితో పోల్చుకుంటే డీఎస్ఓ చానా చిన్న అధికారిని తనిఖీ కూడా వేటు తప్పదని, కావున ఇప్పటికైనా డిఎస్ఓ కళ్ళు తెరిచి ఎంక్వయిరీ చేసి, అర్హులైన వారికి స్థలాలు మరియు మిషనరీని కేటాయించాలని పునీత్ కోరారు, లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని పునీత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, షేన్ షా, రామాంజనేయులు, శ్రీనివాసులు, హరీష్, శ్రీనాథ్, నవీన్, శశి, వినయ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Complaint to the ED to arrange development of silk industry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *