తెలుగుదేశం ప్రభుత్వంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

Complaint to the Election Commission on the Telugu Desam Government

Complaint to the Election Commission on the Telugu Desam Government

Date:17/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

అధికార తెలుగుదేశం పార్టి ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తోందని వైఎస్సార్‌సీపీ జెడ్పి ప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌ , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర ఫిర్యాదు చేశారు. ఆదివారం ఈ మేరకు ఏఆర్‌వో సుబ్రమణ్యంరెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం క్రింద 5,569 మంది తెలుగుదేశం పార్టీ లబ్ధిదారులకు కోట్లాది రూపాయల డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను పంపిణీ చేస్తోందని , ఈ పరికరాలను డీర్లకు చేర్చి, డీలర్ల ద్వారా రైతులకు చేర్పించి, ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల నియామావళిని అతిక్రమించిందని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై నివేదికలు పంపుతామని ఏఆర్‌వో తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లె ఎంపీపీ అంజిబాబు , పార్టీ నేతలు సుబ్బన్న, పెంచుపల్లె క్రిష్ణ, రమణ, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

Tags: Complaint to the Election Commission on the Telugu Desam Government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *