నిరుద్యోగులను మోసం చేస్తున్న సామాజిక మాద్యమాలపై పోలీసులకు ఫిర్యాదు
తిరుమల ముచ్చట్లు:
పదవ తరగతి పాసైన వారికి టీటీడీ లో లక్ష రూపాయల వరకు జీతం తో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న 8 సామాజిక మాధ్యమాలపై గురువారం టీటీడీ ఐటి జీఎం
శ్రీ ఎల్ ఎం సందీప్ తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాల చిరునామాలు ఐటి విభాగం గుర్తించింది. వీటి పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ సందీప్ కోరారు. నిరుద్యోగులెవరు ఇలాంటి ప్రకటనలకు మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్ సైట్
www. tirumala.org ద్వారా ఇలాంటి విషయాలు ధృవీకరించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags:Complaint to the police about social media cheating the unemployed

