ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి
‘స్పందన’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో జిల్లా ఎస్.పి కే కే ఎన్ అన్బురాజన్
కడప ముచ్చట్లు:
జిల్లాలో బాధితులు పోలీసు శాఖ కు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ ‘స్పందన’ కార్యక్రమంలో బాధితులతో స్వయంగా ముఖాముఖి మాట్లాడి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను తెలుసుకున్నారు. ‘స్పందన’ ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Tags: Complaints should be dealt with promptly and justice done
