మహాకుంభ మేళ కు ఏర్పాట్లు పూర్తి

Complete arrangements for the Mahakumbha mela

Complete arrangements for the Mahakumbha mela

 Date:14/01/2019
లక్నో  ముచ్చట్లు:
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో  అర్ధ కుంభమేళా మహాక్రతువు ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 100 హెక్టార్లలో గుడారాలు, వీఐపీల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సారి అక్షయ్ వాత్, సరస్వతి కూప్ ల వద్ద పూజలు చేసుకునే అవకాశం కల్పించారు. 450 ఏళ్ల కుంభమేళా చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఇందుకోసం రూ. 2,800 కోట్లు ఖర్చు చేసింది యూపీ ప్రభుత్వం. కుంభమేళా పూర్తయ్యే నాటికి రూ. 4,300 కోట్లు వ్యయం కావొచ్చని అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళా ప్రదేశంలో ఇవాళ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. అగ్నిప్రమాదంతో పలు తాత్కాలిక నిర్మాణాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.
Tags:Complete arrangements for the Mahakumbha mela

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *