Natyam ad

పుంగనూరులో అభివృద్ధి కార్యక్రమాలు తక్షణం పూర్తి చేయండి

– గంగజాతర ఏర్పాట్లు
-మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఎన్నికల కోడ్‌ సమీపిస్తున్న కారణంగా కాంట్రాక్టర్లు అభివృద్ధి కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆదేశించారు. సోమవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకు పనులను కేటాయించారు. అలాగే గంగజాతరకు పారిశుద్ధ్యం, మంచినీరు , విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు చేసేందుకు తగు చర్యలు తీసుకునే విషయమై చర్చించారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి నిధులతో నిర్మిస్తున్న భవనాలకు, న్యాయవాదుల సంఘ భవనానికి మున్సిపల్‌ అనుమతులు మంజూరు చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలన్నారు. గంగజాతర , రంజాన్‌ పండుగల సందర్భంగా పట్టణంలో ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు, మంచినీటి సమస్య లేకుండ చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన సామాగ్రీని కొనుగోలు చేసేందుకు అనుమతులు జారీ చేశారు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ లలిత, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Complete development projects in Punganur immediately

 

Post Midle