పుంగనూరులో 15లోపు గృహనిర్మాణాలు పూర్తి చేయండి -జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
జగనన్న కాలనీలలో గృహనిర్మాణాలు ఈనెల 15లోపు పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మండల కార్యాలయంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరితో కలసి గృహ నిర్మాణశాఖ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సీఈవో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కాలనిలన్ని సుందరంగా ఉండేలా చూడాలన్నారు. లబ్దిదారులు అవగాహన కల్పించి, నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల కార్యదర్శులు, సర్పంచ్‌లు ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు. ఎవరు అలసత్వం వహించవద్దన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఏఈలు హేమంత్‌కుమార్, శేఖర్,ఐకెపి ఏపిఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Complete housing construction in Punganur within 15 -ZDP CEO Prabhakar Reddy
