Natyam ad

ఇండోర్ స్టేడియం పనులు మార్చి లోపల పూర్తి చేయండి

-ఏప్రిల్ లో అందుబాటులోకి తీసుకురావాలి
-మేయర్ డాక్టర్ శిరీష, కమీషనర్ అనుపమ అంజలి

తిరుపతి ముచ్చట్లు:

ఇండోర్ స్టేడియం పనులు మార్చి లోపల పూర్తి చేసి నగర ప్రజలకు ఏప్రిల్ కి అందుబాటులోకి తీసుకురావాలని మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అధికారులను,ఏయికామ్ ప్రతినిధులు, కాంటాక్ట్లను ఆదేశించారు.నగరపాల సంస్థ పరిధిలోని ఇందిరా మైదానం వద్ద నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులు గురువారం మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి జరుగుతున్న పనులు సమయుక్తంగా పరిశీలించారు. మార్చి లోపల పనులు పూర్తి చేసి, ఏప్రిల్ నెలలో నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.మేయర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం పనులు మార్చి లోపల పూర్తి చేసి ఏప్రిల్ నెలలో నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకోవచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.ఈ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకతతో నిర్మిస్తున్నామని తెలియజేశారు.కమీషనర్ మాట్లాడుతూ ఈ స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, జిమ్ ఏర్పాట్లు చేస్తున్నామని క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తున్నముఅని తెలిపారు.మేయర్ తో పాటు కమీషనర్ అనుపమ అంజలి, స్మార్ట్ సిటీ డి.ఈ.మెహన్, ఏయికామ్ ప్రతినిధులు బాలాజీ, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Complete indoor stadium works by March

Post Midle