Natyam ad

పూర్ణ మార్కెట్ బంద్

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ నగరంలోని అతిపెద్ద మార్కెట్ అయిన పూర్ణ మార్కెట్ నేడు బంద్ అయింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఒకరోజు బంద్ పాటించింది. మార్కెట్లోని వర్తకసంఘం సభ్యులంతా తమ దుకాణాలు మూసివేసి నిరసన తెలియజేశారు. ప్రధానంగా పూర్ణ మార్కెట్ బయట రోడ్లపై చిరు వ్యాపారాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అతిపెద్ద మార్కెట్గా పూర్ణ మార్కెట్ పేరుగాంచింది. రోజుకు కొన్ని లక్షల రూపాయల వ్యాపార లావాదేవీలు ఈ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన పూర్ణ మార్కెట్ ఇప్పుడు రోడ్లపై చిరు వ్యాపారులవలన వ్యాపారాలు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వర్తక సంఘం ఆవేదన వ్యక్తం చేస్తుంది. వినియోగదారులు మార్కెట్లోకి రాలేని విధంగా ఇష్టానుసారంగా వీధి వ్యాపారులు అడ్డంగా రోడ్లపై

వ్యాపారాలు చేయడం వలన మార్కెట్లోకి వచ్చి కొనేవారు తగ్గిపోయారని వ్యాపారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఒకరోజుబందుకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పూర్ణ మార్కెట్ లోని దుకాణాలు మూసివేసి వర్తకులు తమ నిరసన తెలియజేశారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ కు తమ విజ్ఞాపనను తెలియజేసీనట్టు పూర్ణమార్కెట్ వర్తక సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ సాహో తెలిపారు.

 

Post Midle

Tags: Complete market shutdown

Post Midle