ముమ్మరంగా సభ్యత్వ నమోదు పూర్తి కావాలి

Complete membership registration must be completed

Complete membership registration must be completed

Date:23/11/2018
పలమనేరు ముచ్చట్లు:

నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా పూర్తిచేయాలని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి నాయకులకు సూచించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులనుద్దేశించి మాట్లాడుతూ…పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గతంలో కంటే ఎక్కువగా సభ్యత్వాలను నమోదు చేయించాలని సూచించారు. పార్టీ తెలియజేసిన సమయానికంటే ముందు సభ్యత్వాలను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అజెండాలోని అంశాల వారీగా సమీక్షించారు. ముఖ్యంగా పనుల పురోగతిలో నాయకుల పాత్ర, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఓటర్ల నమోదు ప్రక్రియలో నాయకుల పాత్ర తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై తెలియజేయాల్సిన అవశ్యం ఉందని నాయకులకు వివరించారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చాన్ బాషా, ఏఎంసీ మాజీ చైర్మన్ రామచంద్రనాయుడు, ఎంపీపీ గీత, జిల్లా నాయకులు ఆర్వి బాలాజీ, మైనార్టీ నాయకులు ఇక్బాల్, బాలాజీ నాయుడు, కదిరప్ప,మండల పార్టీ అధ్యక్షుడు జగదీష్ నాయుడు, కిషోర్ గౌడ, రంగనాథ్,శ్రీరాములు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు

Tags:Complete membership registration must be completed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *