భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి

జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్,

నంద్యాల ముచ్చట్లు:

ప్రభుత్వ ఆక్రమిత భూములు, రెవిన్యూ సర్వీసుల ఆలస్యంపై ప్రతిరోజు వార్తాపత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్న నేపథ్యంలో..సంబంధిత వార్తలపై తక్షణమే స్పందించి అదే రోజు సాయంత్రానికి యాక్షన్ టేకెన్ రిపోర్టులు పంపడంతో పాటు రీజాయిన్డెర్స్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్లోని డి-సెక్షన్ సిబ్బంది ప్రతిరోజూ తాసిల్దార్లతో సంప్రదించి స్పందన, వ్యతిరేక వార్తల రిపోర్ట్లు తెప్పించుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించారు. రెవెన్యూ సర్వీసులు అందించడంలో అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి జిల్లాలో 19,600 పెండింగ్ లో ఉన్నాయని… ఇందుకు సంబంధించి అడ్డంకిగా ఉన్న ఈకేవైని వంద శాతం పూర్తిచేసి త్వరితగతిన ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టాల పంపిణీ చేసిన లబ్ధిదారులకు పొజిషన్ చూపాలన్నారు.

 

 

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వ్యక్తులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని మండల తాసిల్దార్లను ఆమె ఆదేశించారు.  ప్రాధాన్యత భవనాలకు పెండింగ్లో ఉన్న రెండు సైట్ లను పంచాయతీరాజ్ శాఖకు స్వాధీనం చేయాలని ఆమె ఆదేశించారు. జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలు, పరిశ్రమలకు అవసరమై పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు తాసిల్దార్ లు, రెవిన్యూ సర్వేయర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం కింద చేపట్టిన సమగ్ర రీ సర్వే పనులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరుజ్ హౌస్ సైట్ ఆడిట్, వివిధ కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులు తదితర రెవెన్యూ అంశాలపై మండల తాసిల్దార్ లు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, దాసు,ల్యాండ్ అండ్ సర్వే ఎడి హరికృష్ణ, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు, సిబ్బంది అన్ని మండలాల తాసిల్దారులు  పాల్గొన్నారు.

 

Tags: Complete the land acquisition process expeditiously

Leave A Reply

Your email address will not be published.