యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తి: సీఎం జగన్‌

అమరావతి ముచ్చట్లు :

పోలవరం అత్యంత ప్రాధాన్యతగల ప్రాజెక్ట్‌ అని సీఎం జగన్‌ చెప్పారు. యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్‌శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. కేంద్రం నుంచి దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు.. వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లి పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు. త్వరలోనే నేరడి బ్యారేజీపై ఒడిశాతో మాట్లాడతామని సీఎస్‌ చెప్పారు. వెలిగొండ టన్నెల్‌-2 పనులు వేగవంతం చేయాలని, వంశధార- నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తిచేయాలని జగన్‌ ఆదేశించారు.

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

 

Tags:Complete the Polavaram project on a war footing: CM Jagan‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *