Natyam ad

 పూర్తవుతున్న వరినాట్లు… కొనుగోళ్లు ఎప్పుడు

నిజామాబాద్ ముచ్చట్లు:

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయ్. వరి కోతల్లో రైతులు బిజీగా ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ముందే కోతలు పూర్తి చేసిన వరి రైతులు…ధాన్యం అమ్మటానికి ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాక అవస్థలు పడుతున్నారు. తక్కువ రేటుకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది ఆందోళన చెందుతున్నారు.పూర్తి స్థాయిలో రైస్ మిల్లుల అలాంట్మెంట్ కాలేదని తెలుస్తోంది. ధాన్యం సేకరణలో కీలకపాత్ర పోషించాల్సిన పౌర సరఫరాల సంస్థకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడం సమస్యగా మారుతోంది. ఇటీవల డీఎస్వోగా బదిలీపై వచ్చిన అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయినా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ధాన్యం సేకరణ సమయం ముంచుకొస్తున్నా రైస్ మిల్లుల అలాట్మెంట్, గన్నీ బ్యాగుల సరఫరా, ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. తద్వారా ధాన్యం సేకరణకు జాప్యం జరిగుతోంది.జిల్లాలో ధాన్యం సేకరణకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సొసైటీ ఛైర్మన్లు కూడా భావిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ప్రక్రియ సజావుగా సాగాలంటే అదనపు కలెక్టర్ సహా డీఎస్పీ, డీఎం, డీసీవో, ఇతర అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 

 

 

 

రూరల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలకు టెండర్‌కు లారీల యజమానులు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. గత్యంతరం లేక ఓ సంస్థకు రవాణా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇవేగాక ధాన్యం సేకరణలో కడ్తా, నగదు జమ, తదితర సమస్యలు ప్రతి సీజన్లో ఉత్పన్నమవుతాయి.పౌరసరఫరాల శాఖ అధికారులు 10 లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 477 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1.20 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని. కమిషనర్ ఆదేశాల మేరకే ట్రాన్స్పోర్ట్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగిందని చెబుతున్నారు. 305 రైస్ మిల్లులకుగాను కేవలం 142 మిల్లులకే అలాట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కోతలు అయిన వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా జరగటంతో వర్షానికి రైతులు భారీగా ధాన్యం నష్టపోయారు. ఈసారి అలా కాకుండా వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోళు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.

 

Post Midle

Tags: Completed Varinatu… When purchases

Post Midle