ఆగష్టు 15వ తేదీలోగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ..  బడా హొటళ్ల ముందు గాంధీ గిరి

Date:18/07/2018
హైదారాబాదు ముచ్చట్లు:
రోజుకు 50 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారా! అయితే ఆగష్టు 15వ తేదీలోగా కంపోస్ట్ ఎరువుల తయారీ యూనిట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.”  ఇది  జీహెచ్ఎంసీ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, కళ్యాణమండపాలు, బాంకెట్ హాళ్లకు నిర్థారించిన గడువు.  2016 వ్యర్థపదార్థాల నిర్వహణ నిబంధనలను అనుసరించి 50 కిలోల వ్యర్థాలను రోజుకు ఉత్పత్తి చేసే ప్రతి సంస్థ తప్పని సరిగా అంతర్గతంగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు నగరమేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డిలు నగరంలోని హోటళ్లు,  రెస్టారెంట్లు, ఫంక్షన్హాళ్ల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికి కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బడా హొటళ్లు, రెస్టారెంట్ల వద్ద నేడు జీహెచ్హెంసి అధికారులు, సిబ్బంది గాందీ గిరి నిర్వహించారు. వెంటనే కాంపొస్ట్ యూనిట్లను యెర్పాటు చేయాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చెసారు. రోజుకు 50 కిలోల కన్నా అధిక మొత్తంలో చెత్తను ఉత్పత్తి చేసే వాటిని బల్క్ గార్బెజ్ జనరేటరుగా ప్రకటించారు. ఈ బల్క్ గార్బేజ్ ఉత్పత్తి సంస్థలన్నీ ఆగష్టు 15వ తేదీలోగా తప్పనిసరిగా కంపోస్ట్ పిట్లను గానీ, కంపోస్ట్ యంత్రాలను గానీ ఏర్పాటు చేసుకోవాలని, లేనట్టయితే తనిఖీలు నిర్వహించి తగు చర్యలను చేపట్టడం జరుగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. మార్కెట్లో లభ్యమయ్యే కంపోస్ట్ ఎరువుల తయారీ యంత్రాల ధరలు, అవి దొరికే ప్రాంతాలు, విక్రయించే సంస్థల వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్లో మరింత మెరుగైన పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలకు చేయుతనివ్వాలని ఇందుకు గాను వెంటనే కాంపొస్ట్ యూనిట్లు యెర్పాటు చేయాలని జీహెచ్హెంసి మరోమారు కోరింది. నేడు జరిపిన గాందీ గిరి తో  వెంటనే కంపోస్ట్ యూనిట్లు  ఏర్పాటు చేయనున్నట్లు పలు హొటళ్ యజమానులు అంగీకరించారు.
ఆగష్టు 15వ తేదీలోగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ..  బడా హొటళ్ల ముందు గాంధీ గిరి https://www.telugumuchatlu.com/compost-units-should-be-established-by-august-15th-gandhi-giri-before-the-big-places/
Tags:Compost units should be established by August 15th. Gandhi giri before the big places

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *