సమగ్ర కుటుంబ సర్వే  బహిర్గతం చేయాలి-కాంగ్రెస్ ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షుడు మహేష్

ప్రజాక్రాంతి ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు వినతిపత్రం  ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుటుంబ సర్వే వివరాలను దాచి  ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీసీ గణన చేపట్టి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెజారిటీ  బీసీలకు జ్యూడిషరి వ్యవస్థతోపాటు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.  అలాగే విద్యా, వైద్యం, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.  ఆయన వెంట బిసి సెల్ మంథని డివిజన్ అధ్యక్షుడు గోటీకార్ కిషన్, నాయకులు బరపటి శ్రీనివాస్, గుండా రాజు ముదిరాజ్, భీముని లింగయ్య గౌడ్, తోకల మల్లేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, పెండ్యాల వెంకటేష్, ఉప్పల వెంకటేష్, సాయి వంశీ, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Comprehensive Family Survey Should Be Disclosed-Congress OBC Cell District President Mahesh

Post Midle
Post Midle
Natyam ad