Natyam ad

నిరుద్యోగులను మోసం చేసిన కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుడు అరెస్టు

ఉత్తేజిత ముచ్చట్లు:


పోలీసు కానిస్టేబుల్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను నకిలీ రశీదులతో మోసం చేసిన కంప్యూటర్ సెంటర్ నిర్వాహకుడు సయ్యద్ అమీర్ బాష ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు నందికొట్కూరు అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ విజయ భాస్కర్ తెలిపారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పట్టణంలోని సాయిబాబా  పేటకు చెందిన సయ్యద్ ఇబ్రహీం కుమారుడు సయ్యద్ అమీర్ బాష  నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డు లో గల  అమీర్ ఇంటర్నెట్ కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.

 

 

 

ప్రభుత్వ కొలువు కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులను పేక్ రశీదులతో మోసం చేశాడు .36 మంది నిరుద్యోగులు పోలీస్ కొలువు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి పేర్లు ఆన్ లైన్ లో నమోదు చేయకుండానే చేసినట్లు నకిలీ రశీదులు సృష్టించి మోసం చేశాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరక పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేపట్టారు. 50 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని 36 మంది మోసపోయిట్ల పోలీసుల విచారణలో తేలింది.నిందితుడు కాలేజి రోడ్డులో కంప్యూటర్ సెంటర్ సమీపంలో  ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు పేర్కొన్నారు.సమావేశంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Computer center manager arrested for defrauding unemployed

Post Midle