టిటిడి విద్యాసంస్థ‌ల్లో ఆధునిక వ‌స‌తుల‌తో కంప్యూట‌ర్ ల్యాబ్‌లు, గ్రంథాల‌యాలు

Computer labs and libraries with advanced capabilities in TTD educational institutions: Send feedback

Computer labs and libraries with advanced capabilities in TTD educational institutions: Send feedback

-టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Date:15/10/2019

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

టిటిడి విద్యాసంస్థ‌ల్లో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యే లోపు ఆధునిక వ‌స‌తుల‌తో కంప్యూట‌ర్ ల్యాబ్‌, గ్రంథాల‌యాలు, విద్యార్థుల‌కు స‌రిప‌డా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం అంత‌ర్గ‌త ఆడిట్ క‌మిటీ స‌మావేశం జరిగింది.

 

 

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ యాత్రికుల కోరిక మేర‌కు శ్రీ‌వారి ప్రాశ‌స్త్యాన్ని, ఆల‌య చ‌రిత్ర‌ను తెలిపేలా మ‌రిన్ని పుస్త‌కాలను ముద్రించి అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ఆన్‌లైన్‌లో అన్ని పుస్త‌కాల సంక్షిప్త స‌మాచారంతో కేట‌లాగ్ రూపొందించాల‌న్నారు. ప్ర‌తి పుస్త‌కానికి బార్‌కోడింగ్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, పుస్త‌కాల కాల‌ప‌రిమితిని బ‌ట్టి ధ‌ర‌లు నిర్ణ‌యించేలా, డిస్కౌంట్ ఇచ్చేలా విధి విధానాలు రూపొందించాల‌ని జెఈవోకు సూచించారు. టిటిడి ప్రెస్‌లో పుస్త‌కాల ముద్ర‌ణ స‌మ‌యంలో పేప‌రు వృథాను అరిక‌ట్టాల‌న్నారు. టిటిడిలో ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అప్లికేష‌న్ రూపొందించాల‌ని, మందుల స‌ర‌ఫ‌రాలో నిబంధ‌న‌లు ఉల్లంఘించే సంస్థ‌లకు జ‌రిమానా విధించాల‌ని ఆదేశించారు.

 

 

 

బెంగ‌ళూరు, హైద‌రాబాద్, ముంబ‌యిలోని స‌మాచార కేంద్రాలు, చింతామ‌ణి, హోసూరు, బంగారు తిరుప‌తిలోని క‌ల్యాణ‌మండ‌పాల వ‌ద్ద ద‌ర్శ‌న టికెట్ల బుకింగ్‌, శ్రీ‌వారి డాల‌ర్లు, ప్ర‌చుర‌ణ‌ల‌ విక్ర‌యం, భ‌క్తుల‌కు సంబంధించిన ఇత‌ర అంశాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు అక్క‌డి అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని జెఈవోను కోరారు. ఈ ప్రాంతాల్లో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని, ట్ర‌స్టులు, స్కీముల వివ‌రాల‌ను క‌ర‌ప‌త్రాల రూపంలో ముద్రించి అందుబాటులో ఉంచాల‌న్నారు. స్థానికాల‌యాల‌తోపాటు ఉద్యాన‌వ‌న‌, గోశాల‌, ఆరోగ్య త‌దిత‌ర విభాగాల్లో బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఇఆర్‌పి విధానాన్ని అమ‌లు చేయాల‌న్నారు.ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో   పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో   గోపినాథ్ జెట్టి, ప్రముఖ ఆడిటర్లు   నరసింహమూర్తి,   శరత్‌, ఎఫ్‌ఏ,సిఏవో  ఓ.బాలాజి, అద‌న‌పు ఎఫ్ఏ, సిఏవో   రవిప్రసాదు, సిఏవో   శేష‌శైలేంద్ర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తిరుమ‌ల‌లో ఆన్‌లైన్‌లో గ‌దుల బుకింగ్‌కు కాష‌న్ డిపాజిట్  

Tags: Computer labs and libraries with advanced capabilities in TTD educational institutions:
Send feedback

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *