సీపీఎస్‌ను రద్దు చేయకపోతే ఆందోళన

Date:18/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని అమలు చేయాలని లేకపోతే ఆందోళన చేస్తామని ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఎంఆర్‌సీ వద్ద ఎస్టీయు డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపామన్నారు. అలాగే బదిలీల షెడ్యూలును వెంటనే విడుదల చేయాలని, ఈఎన్‌ఆర్‌ నమోదు పక్రియను డిసెంబర్‌ వరకు పొడింగించాలని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించకపోతే ఆందోళన తప్పదని తెలిపారు. ఈసమావేశంలో ఎస్టీయు నాయకులు కిషోర్‌కుమార్‌రెడ్డి, అయూబ్‌ఖాన్‌, లింగమూర్తి, రెడ్డెప్ప, గురుప్రసాద్‌, రమణ, నరసింహులు, ప్రభాకర్‌, రమణయ్య, ఖాదర్‌బాషా, సురేష్‌, ప్రకాష్‌రెడ్డి, చెంగల్రాయచారి, నరేంద్ర , మురళి తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ సేవల్లో పుంగనూరు ఫస్ట్

Tags: Concern if CPS is not repealed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *