Natyam ad

ఏయూలో దళిత సంఘాల అందోళన

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యా లయం లో దళితులు, గిరిజనుల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరసన తెలిపాయి. రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.దళిత హక్కుల పోరా ట కమిటీ సభ్యులు ప్రభాకర్ మాట్లా డుతూ ఏయూ లో ఆచార్య జాన్ పై, విద్యార్ధులపై జరిగిన దాడిని ఖండిస్తు న్నామని,నోటీసులు కూడా ఇవ్వకుం డా జాన్ ను బయటకు పంపించారని, ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వ్యవహార శైలి సరైనది కాదని,బాద్యు లు పై తక్షణమే చర్యలు తీసుకోవాల ని,ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.ఆచార్య జాన్ మాట్లాడుతూ ఏయూ లో దళితలు పై జరుగుతున్న దాడులను వీసీ అరికట్టా లని,తనపై కక్ష తో గదిని మూసివేశా రని,నిబంధనలు ప్రకారం తనకు రెండేళ్ల పాటు రూమ్ ను కేటాయించా లని అన్నారు.ఏయూ భద్రత అధికారి ఖాన్ పైన, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఏ యూ వీసీ ప్రసాద్ రెడ్డి నాపై, నా కుటుంబం కక్ష సాధిస్తున్నారని, ముఖ్య మంత్రి చొరవ తీసుకొని నాకు న్యా యం చేయాలని,లేకపోతే ఏయూ లో ఉన్న అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరాహా రదీక్ష చేస్తానని చెప్పారు.‎
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Concern of Dalit communities in AU