విధుల్లోకి తీసుకోవాలని జిజిహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన…..

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో అక్రమంగా తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సోమవారం ఉదయం జిజిహెచ్ సెంటర్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగాయూనియన్ నాయకులు పి. ఎస్. రాయుడు, భవానీ లు మాట్లాడుతూ 20 నుండి 13 సంవత్సరాల సర్వీసు తో జిజిహెచ్ లో సేవలు చేసామన్నారు. కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలు పణంగా పెట్టిసేవలు అందించామన్నారు. 2011 నుండి తమ జీతం కనిష్టంగా 4030రూ. గరిష్టంగా 6110రూ. మాత్రమే అన్నారు. 2022 జూన్ 1 న అక్రమం గా విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే కన్నబాబుకి, జిల్లా కలెక్టర్ కి తమ గోడు విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వరకు తమ సమస్యను తీసుకు వెళ్ళి న్యాయం చేయాలనికోరుతున్నామన్నారు.
సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రదాయిని గా సేవలు అందిస్తున్న కాకినాడ జిజిహెచ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు
చాలా అన్యాయం చేశారని విమర్శించారు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో వివిధ కార్మిక సంఘాల మద్దతు తో ఉద్యమాన్నిమరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, డిఎల్ రాజు, ఎన్. సత్తిబాబు, లలిత,  పద్మిని, బేబిరాణి, చంద్రకళ, శ్రీనివాస్, లక్ష్మీ నారాయణ, చక్రవర్తి, భవాని, రేవతి, చిట్టితల్లి, కళావతి,తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Concern of GGH Outsourcing employees to take up duties…..

Leave A Reply

Your email address will not be published.