జూనియర్ డాక్టర్ల అందోళన

Date:11/08/2020

కాకినాడ ముచ్చట్లు:

కరోనా నేపథ్యంలో కాకినాడ జి.జి.హెచ్. లో హై రిస్క్ జోన్ లో పనిచేస్తున్న  తమకు మెరుగైన రక్షణ పరికరాలు అం దించాలని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. సోమవారం రాత్రి జి. జి. హెచ్. ఆవరణలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు. జూడా ఉపాధ్యక్షులు డాక్టర్ నవీన్ మాట్లాడుతూ ప్రతిరోజు అధిక సంఖ్యలో కోవిడ్ బాధితులు కాకినాడ  జి .జి. హెచ్. కు వస్తున్నారన్నారు. వీరికి సేవలందించడంలో తాము కీలకంగా పని చేస్తున్నామన్నారు. ఒక్కోసారి కోవిడ్ బారినపడి వైద్యులు మరణిస్తున్నారని, ఇది తమకు ఆందోళన కలిగిస్తోంది అన్నారు. అందువల్ల తమ కు ఆరోగ్య బీమా అమలు చేయాలన్నారు. అలాగే  తమకు అందిస్తున్న పి. పి. ఈ. కిట్లు నాణ్యంగా ఉండటం లేదన్నారు. తమకు నాణ్యమైన ఎన్ 95 మాస్కులు , పి. పి .ఈ .  కిట్లు        అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు . కోవిడ్ విధుల్లో ఉన్న తమకు సహాయంగా అవసరమైన వైద్య సిబ్బందిని సమకూర్చాలి అన్నారు. పీజీ లకు ప్రతి రెండేళ్లకు వేతనం పెంచాల్సి ఉండగా, రెండేళ్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వ ఇంకా పెంచలేదు అన్నారు. కొవిడ్ విధుల్లో ఉన్న వారికి ఇన్సెంటివ్ లు వెంటనే అందించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 14 నుంచి అత్యవసర సేవలను బహిష్కరిస్తాం అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ భాస్కర్, ఉపాధ్యక్షులు డాక్టర్ కళాసాగర్, కోశాధికారి డాక్టర్ సాధన, అధిక సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.

కడప జైలులో కరోనా

Tags: Concern of junior doctors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *