కపిలేశ్వరపురం గ్రామస్తుల ఆందోళన అంగర పోలీసుస్టేషన్ ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు

ఇద్దరు యువకులను అన్యాయంగా శిక్షించారు అంటూ మండిపాటు
ఉన్నతాధికారుల జోక్యంతో శాంతించిన ప్రజలు

రాజమండ్రి  ముచ్చట్లు:
మండపేట  మండలం కపిలేశ్వరపురం గ్రామంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. అంగర పోలీసుస్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయాలంటూ ధర్నా చేశారు. వివరాలలోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో గోదావరి రేవు లో రెండు రోజుల క్రితం ఇద్దరు యువకులు మద్యం సేవిస్తుండగా అటూగా వెళ్తున్న ఎస్సై  వారిని మందలించారు. దాంతో యువకులు వాదనకు దిగారు. అప్పుడు ఎస్సై పోలీసు దుస్తులలో లేకపోవటంతో యువకులకు, ఎస్సైకి మధ్య ఘర్షణ పెరిగి కొట్లాటకు దారి తీసింది. వెంటనే అంగర పోలీసుస్టేషన్ సిబ్బంది అక్కడకు చేరుకొని యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా వారిని కొడుతూ, ఎవ్వరు అడిగినా సమాధానం ఇవ్వలేదు. యువకులిద్దరిని  చలనచిత్రాలలో నేరస్తులను చూపినట్లు పోలీసులు గ్రామం మొత్తం సంకెళ్ళతో ఊరేగింపు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ కారణంగా యువకులను వెంటనే విడుదల చేయాలని, అంగర పోలీసుస్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయాలని నినదిస్తూ ఊరు ఊరంతా రోడ్లను ఆశ్రయించి ధర్నాకు దిగారు.  ఇంతలో విషయం తెలుసుకున్న డి. యస్పి బాలచంద్రా రెడ్డి, మండపేట పట్టణ సీఐ నున్న రాజు ఘటనా స్థలానికి చేరుకుని  నిరసనకారులతో మాట్లాడి శాంతింపచేసారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Concern of Kapileswarapuram villagers
Slogans against Angar Police Station Essay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *