హెల్త్ సెంటర్ అభివృద్ది పనులకు శంకుస్థాపన

Date:21/11/2020

నర్సాపురం  ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల కోట్ల రూపాయలు వైద్య సౌకర్యాలు మెరుగుపర్చడానికి కేటాయిస్తే పశ్చిమ గోదావరి జిల్లా కు 12 వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఘనత జగన్ ప్రభుత్వానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు.  శనివారం  నరసాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆధునీకరణ ల బాగంగా 11 కోట్ల 64 లక్షలు ఆధునీకరణ కు శంఖుస్దాపన చేసారు. ఈసంధర్బంగా మాట్లాడుతూ గత తెలుగుదేశంలో  పి.హెచ్.సి లు గాని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాని ఎక్కడా వాటి అభివృద్ధి ని పట్టించుకోలేదని జగన్ మెాహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాతే శాసన సభ్యుడు ముదునూరి ప్రసాద్ రాజు చొరవతో అభివృద్ధి కి నోచుకున్నాయని అన్నారు. ఆంద్రప్రదేశ్ లో దాదాపు 11 మెడికల్ కాలేజిలు మాత్రమే వుంటె ప్రతీ పార్లమెంట్ పరిధిలో  ఒకేసారి  మరో 16 మెడికల్ కాలేలు ఏర్పాటు చేయడం అనెది సామాన్య విషయం కాదని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగనటు వంటి మహత్తర మైన కార్యక్రమం జగన్ మెాహన్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమం లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.

నందింగం.. ఉండవల్లి మధ్యలో డొక్కా

Tags: Concreting for health center development works

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *