చేరికలకు కండిషన్స్ అప్లై

హైదరాబాద్  ముచ్చట్లు:

ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌లో చేరికలు జోరు పెరిగింది. అదే స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అంతా హైకమాండ్‌ పేరు చెప్పి కండువాలు కప్పేస్తుండటంతో.. సీనియర్లకు కాలుతోందట. దీనిపై ఢిల్లీకి అదేపనిగా ఫిర్యాదులు వెళ్లడంతో.. హైకమాండ్‌ తరుణోపాయం సూచించిందట. దానిపైనే ప్రస్తుతం కాంగ్రెస్‌లో చర్చ సాగుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలపై గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మొదలైన పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. భట్టిని ఢిల్లీకి పిలిచి చర్చించారు. అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదులు కంటిన్యూ అవుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చేరికల సమాచారం తనకు లేదని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. యాష్కీతో పాటు…

 

 

 

దామోదర రాజనర్సింహ… లాంటి నేతల నుంచి ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా హుస్నాబాద్ ప్రవీణ్ రెడ్డీ చేరిక తో కొందరు నేతలు మళ్లీ కంప్లయింట్‌ చేశారు. మెట్ పల్లి జెడ్పీటీసీ చేరికలపై మధుయాష్కీకి, ఖమ్మం జిల్లా చేరికపై భట్టికి, దేవరకొండ చేరికలపై ఉత్తమ్ కి, మెదక్ చేరికపై దామోదర రాజనర్సింహకి సమాచారం లేదని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయట.వరసగా ఫిర్యాదులు రావడంతో.. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అధిష్ఠానం. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి .. ఆ జిల్లా నేతలకు సమాచారం లేకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని అధిష్ఠానానికి ఫిర్యాదు వెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ కొంత స్పష్టత ఇచ్చింది. చేరికలపై ఢిల్లీ పెద్దలకు రేవంత్‌రెడ్డి చెబుతున్నా.. స్థానిక నాయకత్వానికి ఆ సమాచారం వెళ్లడం లేదనేది ప్రధాన అభ్యంతరం. అందుకే సమస్యను కొలిక్కి తెచ్చింది. ఇకపై పార్టీలో ఎవరు చేరుతున్నా.. 48 గంటల ముందు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారట.

 

 

బోసురాజు ఆ తర్వాత సంబంధిత జిల్లా నేతలకు.. స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వాలని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది.వాస్తవానికి ఇలాంటి సమస్యలు వస్తాయనే కాంగ్రెస్‌లో చేరికల కమిటీ వేశారు. దానికి మాజీ మంత్రి జానారెడ్డి ఛైర్మన్‌. ఆ కమిటీ ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు జరిగిన చేరికలు ఏవీ అక్కడ చర్చించిన ధాఖలాలు లేవు. నామ్‌ కే వాస్తేగా మారిపోయింది చేరికల కమిటీ. ముందుగా సమాచారం లీకైతే.. చేరేవారు జారిపోతారనే ఆందోళన రేవంత్ శిబిరంలో ఉంది. దానికి మిగతా సీనియర్లు ఒప్పుకోవడం లేదు. సమిస్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన చోట ఏకపక్ష చర్యలను స్వాగతించలేమని చెబుతున్నారు.కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ చేరికలు ఎందుకు లేవు.. అభ్యంతరాలు చేప్పే నాయకులకు వచ్చే నష్టం ఏంటి? ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి చేరింది ఇద్దరే అయినా.. వాటిపై జిల్లా నాయకులతో చెప్పామన్నది పీసీసీ చీఫ్‌ వర్గం వాదన. అధిష్ఠానం మాత్రం 48 గంటల ముందుగా సమాచారం అనే నిబంధన పెట్టింది. మరి ఈ రూల్‌ వర్కవుట్‌ అవుతుందో లేక.. చేరికల కమిటీ మాదిరే దానిని పక్కన పడేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే రేవంత్‌ టీమ్‌పై పైచెయ్యి సాధించామనే అభిప్రాయంలో పార్టీ నేతలు ఉన్నారట. మరి.. ఇకపై చేరికల విషయంలో ఎలాంటి గొడవలు తెరపైకి వస్తాయో చూడాలి.

 

Tags: Conditions of admission apply

Leave A Reply

Your email address will not be published.