Natyam ad

గుంటుపల్లి మృతికి సంతాపం

శ్రీకాళహస్తి ముచ్చట్లు:


టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు, గతంలో రెండుసార్లు నాయీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పని చేసిన ప్రముఖ బీసీ నాయకుడు గుంటుపల్లి నాగేశ్వరరావు నరసరావుపేట లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలుగుదేశం పార్టీ నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటుపల్లి నాగేశ్వరరావు గారి అకాల మరణానికి సంతాపం తెలుపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు, నెమళ్ళూరు బుజ్జి, మునిరాజా యాదవ్, బీమాల వెంకటేశ్వర్లు, రామచంద్రయ్య, కృష్ణమూర్తి, కుమార్, సాయి నాయుడు, ప్రకాష్, జయకృష్ణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Condolences on death of Guntupalli

Post Midle
Post Midle