న్యాయస్థానాల్లో తెలుగు బాష వాడకం ఫై 18 న సదస్సు 

Date:15/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
అంతర్జాతీయ మాతృ బాష దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 18 న న్యాయస్థానాల్లో తెలుగు బాష వినియోగం ఫై ఉద్యమ సమాలోచన సదస్సును నిర్వహిస్తున్నట్లు భాషోద్యమ సమాఖ్య తెలంగాణా రాష్ట్ర కన్వినర్ తిరువరంగం ప్రభాకర్ ,గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు సుబ్బారావు లు తెలిపారు. గురువారం ఇక్కడ మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ విజయవాడ లోని బార్ అసోసేషన్ హాల్ లో జరిగే ఈ సదస్సు కు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్ట్ న్యాయ మూర్తి ఏ.రామలింగేశ్వర్ రావు ముఖ్య అతిధిగా పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే విశిష్ట అతిధులుగా రిటైర్ద్ న్యాయ మూర్తి మంగారి రాజేశ్వర్ రావు,తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు చుక్క రామయ్య తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. న్యాయస్థానాల్లో తెలుగు బాషను పూర్తిగా వినియోగం లోకి తీవాలని తెలుగు ప్రజల బాషలోనే పరిపాలన సాగించడం విద్య రంగాన్ని న్యాయ రంగాన్ని అన్ని స్థాయిల్లో తెలుగులో నిర్వహించడం ప్రభుత్వ భాద్యతని,అంతే కాకుండా ఇది ప్రజల హక్కు,భాషా రాష్ట్రాల ఏర్పాటులో కీలకాంశ మని వారు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో తెలుగు బాషను వినియోగం లోకితేవడం లో విఫలమవుతున్నాయని అన్నారు.ప్రజా జీవన రంగా లోని  క్రియా శ్రీలురు, న్యాయ, విద్య, వైద్య రంగాలలోని ఆలోచనాపరులు,సామాజిక,రాజకీయ రంగాలలోని చితన్య శీలురు, ఆసక్తి గల వారందరూ ఈ సదస్సు లో పాల్గొనవలసిందిగా ప్రభాకర్, సుబ్బారావు లు కోరారు.
Tags: Conference on the use of Telugu language in the courts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *