పొలం విషయంలో ఇరువర్గాల ఘర్షణ

-మండల కేంద్రంలో ఉద్రిక్తత

 

వికారాబాద్ ముచ్చట్లు :

 

వికారాబాద్ జిల్లా పూడురు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య భూ తగాదాలు భగ్గుమన్నాయి.పొలం హద్దుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు కర్రలు,రాళ్ళు రువ్వుకున్నారు.పోలీసుల జోక్యం తో గొడవ సద్దుమణిగింది.ఈ గొడవలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.గతంలో పూడురు మండల కేంద్రంలోని 55 సర్వే నంబరులోని పొలాన్ని బెన్నూరు కుటుంబం,అదే గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డికి అమ్మారు.అమ్మిన పొలం పోజేషన్  విషయంలో ఇరు వర్గాల మధ్య గత కొద్దికాలంగా గొడవ జరుగుతుంది.55 సర్వే నంబరుకు ఆనుకొని ఉన్న 54 సర్వే నంబర్ లో విజయ్ కుమార్ ట్రాక్టర్  తో పొలం దున్నుతుంటే పొలం హద్దుల విషయంలో వెంకట్ రెడ్డి కుటుంబం,బెన్నూరు కుటుంబం మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి కర్రలు,రాళ్ళు రువ్వుకునే వరకు దారితీసింది.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Conflict between the two factions over the farm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *