అమ్మాయి  ప్రేమ విషయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ

-ఒకరి దారుణ హత్య
 
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రేమ వ్యవహారం ఒక యువకుడి హత్యకు దారి తీసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే లోకేశ్వరం మండలం గడ్చంద గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు స్థానిక మహాలక్ష్మి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తూ ప్రియదర్శిని నగర్ లో అద్దెకు ఉంటున్నాడు. అయితే ప్రసాద్ కు గత కొన్ని రోజులుగా ఒక యువతితో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. అదే యువతికి మరో వ్యక్తి సైతం ప్రేమిస్తూ వస్తున్నాడని  ప్రసాద్ మిత్రుడు తెలిపాడు. అయితే ప్రేమ వ్యవహారంలో మంగళవారం రాత్రి ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది, ఈ ఘర్షణలో ప్రసాద్ అనే యువకుడిని తీవ్రంగా కొట్టడంతో  మృతి చెందినట్లు ఆయన మిత్రులు పేర్కొంటున్నారు. మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  తమకు సమాచారం లేకుండానే పోస్టుమార్టం చేయడంపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు ఖయ్యూమ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
 
Tags; Conflict between two young men over girl love

Leave A Reply

Your email address will not be published.