Natyam ad

భార్యతో కలహాలు..ఇద్దరి పిల్లలను కడతేర్చిన కానిస్టేబుల్

మహబూబాబాద్ ముచ్చట్లు:
 
వాళ్లీద్దరిదీ  ప్రేమ వివాహాం.ముద్దులోలికే ఇద్దరు పిల్లలున్నారు.  హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గడ్డిగూడెం తండాకు చెందిన రామ్కుమార్ స్థానికురాలైన శిరీష ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేండ్ల క్రితం వివాహం అయింది.   ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్ కుమార్ ముంబైలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై రామ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరికి వచ్చాడు. సోమవారం రాత్రి భార్య శిరీష.. తన పుట్టింటికి వెళ్లింది. మంగళవారం తెల్లవారుజామున రామ్ తన ఇద్దరు పిల్లలను బైక్పై ఎక్కించుకుని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి చంపాడు. బావిలో ఇద్దరు పిల్లల మృతదేహాలను స్థానికులు గుర్తించి బయటకు వెలికితీశారు.ఇద్దరు పిల్లలను అమీ జాక్సన్ (8), జానీ బెస్టో (6) గా గుర్తించారు. అయితే జానీ బర్త్డేకు ఒక రోజు ముందు తండ్రి రామ్కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామ్ పరారీలో వున్నాడు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Conflicts with wife .. Constable who molested two children