గజ్వేల్ లో ఘర్షణ

Date:07/12/2018
సిద్దిపేట ముచ్చట్లు:
గజ్వేల్ నియోజకవర్గంలోని నేటూర్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయల్నీ అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్న పీఎస్కు తరలించారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గులాబీ బాస్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కూటమి తరఫున ఒంటేరు ప్రతాప్రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకోవడంతో పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత చేపట్టారు.
Tags: Confrontation in Gagev

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *