అయోమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌: ఉత్తమ్‌

Confused Central Election Commission: Good

Confused Central Election Commission: Good

Date:20/09/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
కేంద్ర ఎన్నికల కమిషన్‌ కూడా కాస్త అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటరు జాబితాల్లో తప్పుల తడకలు అధికంగా ఉండటం, ఓట్ల తొలగింపుపై భారీగా ఫిర్యాదులు రావడంతో ఈసీ అయోమయానికి గురవుతున్నట్లు అయన అభిప్రాయపడ్డారు.  ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు 15 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
గురువారం విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఉత్తమ్‌.. వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో ముగుస్తుందని చెప్పారు. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై రెండు సర్వేలు నిర్వహిస్తామని, ఆ సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఆశావహుల జాబితాను పీసీసీ సంప్రదింపుల కమిటీకి అందజేస్తామన్నారు.
మిత్ర పక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయని, కూటమి ఉమ్మడి ఎజెండాకు అన్ని పార్టీలూ అనుకూలంగా ఉన్నాయన్నారు. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. మిత్రపక్షాలు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాలు కోరుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్న ఉత్తమ్‌.. ఒకట్రెండు చోట్ల అలాంటి పరిస్థితులు ఉన్నా చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని స్పష్టంచేశారు.
Tags:Confused Central Election Commission: Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *