Natyam ad

అయోమయంలో గ్రామ సర్పంచులు….నిధులు లేక అభివృద్ధి చేయలేక సతమతమవుతున్న  సర్పంచులు

-వచ్చిన నిధులను నెలసరి వాయిదాల చెల్లింపులకు జమ చేసిన వైనం
-గ్రామాలలో సమస్యలను పరిష్కరించలేని స్థితి
-నిధులు లేకపోవడంతో పారిశుద్ధ్య పరిశుభ్రతకు విగాధం

 
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ  అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణ సాధించే దిశగా అడుగులు వేసి జిల్లాలను  మండలాల విభజించి తాండాలను కూడా గ్రామపంచాయతీలుగా మార్చింది బంగారు తెలంగాణలో భాగంగా అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం వారు అమలు చేయడానికి కావలసిన నిధులు మంజూరు చేసినప్పటికీ విడుదల చేయడంలో జాప్యం చేస్తూ గ్రామ సర్పంచ్ అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సక్రమంగా అందించకపోవడం వలన గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారనీ చర్చించుకుంటున్నారు. నిధులు కరెంటు బిల్లు చెల్లించడానికి నెలసరి వాయిదా చెల్లింపులకు మాత్రమే సరిపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదని గ్రామపంచాయతీల చర్చించుకుంటున్నారు.-నాలుగు నెలలుగా సర్పంచ్లు ఎదురుచూపులు గ్రామపంచాయతీ ఖాతాల్లో నిధులు లేక అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితుల్లో పంచాయతీలు కొనసాగుతున్నాయి. చేపట్టిన పరులకు నిధులు లేక నాలుగు నెలలుగా సర్పంచులు ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఏమి చేయాలన్నా నిదురు లేకపోవడంతో ముద్దు అడుగు వేయలేకపోతున్నారు. గ్రామాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొగ్గలి అక్కడే ఉన్నట్లు ఉన్నాయి. మండలంలో గ్రామపంచాయతీలు 23 ఉన్నాయి.15వ ఫైనాన్స్ నిధులు ఏ పంచాయతీలో చూసినా లేవు. కనీసం పారిశుద్ధ్య పరులు చేపట్టేందుకు. కూడా నిధులు లేవు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చిన్న బొత్తాలతో చేపట్టే, పరులకు కూడా సర్పంచులు ఆలోచన చేస్తున్నారు. సొంత నిధులతో చేయలేక పనులు చేస్తే బిల్లు ఎప్పుడు వస్తాయి ఆలోచనతో వెనుక  అడుగు వేస్తున్నారు. పంచాయతీ ఖాతాలో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇతర అవసరాలకు వినియోగించుకున్నారు. పంచాయతీలు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి కేంద్ర నిధులు ఇస్తే తప్ప చేసిన పనులకు బిల్లులు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు.ఇప్పటికైనా గ్రామపంచాయతీలకు రావలసిన బిల్లులు చెల్లించాలని  గ్రామాల సర్పంచులు కోరుతున్నారు.

 

Tags: Confused village serpents….Serpents who are struggling without funds or development

Post Midle
Post Midle