టిఎస్పిఎస్సి పరీక్షల్లో గందరగోళం

Date:09/10/2018
ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం: దత్తాత్రేయ
హైదరాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మనకు వస్తాయని అనేక సభలలో కేసిఆర్ గొప్పలు చెప్పారని పార్లమెంటు సబ్యులు బండారు దత్తాత్రేయ విమర్శించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏర్పడ్డాక కేసిఆర్ ముఖ్యమంత్రిగా నిండు శాసన సభలో సైతం లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని పదే పదే చెప్పారు. వాస్తవంలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. నియమాకాలకోసం అంటూ బడులు వదిలి, గదులు వదిలి రోడ్డెక్కిన యువత మరియు నిరుద్యోగులు ఉద్యమాన్ని పోరు బాట పట్టించి, తమ శరీరాలకు నిప్పంటించుకొని తద్వారా ఉద్యమానికి అగ్గిరాజేసిన యువత నేడు ఇలా సొంత రాష్ట్రంలో సైతం ఉద్యోగాలకి ఆత్మహత్యలు చేసుకోవలసి రావడం అత్యంత విషాదకరం దురదృష్టకరమని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకూడదనే టిఆర్ఎస్ ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని టిఎస్పిఎస్సి తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా, నిన్న జరిగిన గ్రూప్-4 పరీక్షల నిర్వహణతో మరో మారు ఋజువయ్యింది.   ఉద్యోగ ప్రకటన దగ్గర నుండి నియామక పరీక్ష వరకు టిఎస్పిఎస్సి తన ట్రేడ్ మార్క్ అయినటువంటి అలసత్వాన్ని ప్రదర్శించి మరోమారు ఉద్యోగార్థులకు తీరని ఆవేదనను మిగిల్చిందని పేర్కొన్నారు.ఇప్పటివరకు  టిఎస్పిఎస్సి నిర్వహించిన ఏ ఒక్క ఉద్యోగ ప్రకటన / నియామకం కోర్ట్ మెట్లు దాటకుండా పూర్తికాలేదంటే  అతిశయోక్తి కాదు.
రాష్ట్రం ఏర్పాటుతరువాత టిఎస్పిఎస్సి నుండి విడువడి టిఎస్పిఎస్సి గా మారిన అనంతరం నిర్వహించిన మొట్టమొదటి పరీక్ష అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గరినుండి నిన్న మొన్న నిర్వహించిన గ్రూప్ – 4 వరకు ప్రతీ నియామక పరీక్ష కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, పరీక్ష వ్రాసిన అభ్యర్థులలో తీవ్ర మానసిక ఆందోళన కు గురిచేస్తుందని పేర్కొన్నారు.కమిషన్ ఇప్పటివరకు 105 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయగా, ముఖ్యమైన ప్రకటనలైనా గ్రూప్-2, పిజిటి టీచర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, విఆర్ఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోస్ట్, గ్రూప్-4 తదితర ప్రకటనలు అన్ని కూడా అభ్యర్థుల సహనాన్ని పరీక్షించినవే నన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిర్వహించిన ముఖ్య ఉద్యోగ పరీక్ష అయినటువంటి గ్రూప్-2 ఐతే ఇక చెప్పుకోవలసిన అవసరమే లేదు. ఉద్యోగ ప్రకటన దగ్గరినుండి, దరకాస్తుల  స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన, ధ్రువపత్రాల పరిశీలన దాకా అన్నీ అస్తవ్యస్తంగా, గందరగోళంగా నిర్వహించిన ఘనత మన టిఎస్పిఎస్సి కే దక్కుతుందన్నారు.  గ్రూప్-2 ప్రకటన వచ్చి మూడేండ్లు దాటినా ఇంకా ఉద్యోగాలు కల్పించలేని దుస్థితిలో టిఎస్పిఎస్సి కొట్టు మిట్టాడుతుంది.
పరీక్ష వ్రాసి, ఎంపికై ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తిచేసుకున్న 3,200 మంది అభ్యర్థులు, ఇంకా ఎప్పటికీ తమ సమస్య తీరుతుందో తెలియక నైతిక స్థైర్యం కోల్పోయి ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ పాపం టిఎస్పిఎస్సి ది, కేసిఆర్ సర్కారుకే దక్కిందన్నారు.   టిఎస్పిఎస్సి వ్యవహారం నోటిఫికేషన్ లు ఇచ్చాము, కోర్ట్ కేసులతో మాకేమి సంబంధం అనడం ఎలా ఉందంటే “తాంబూలాలిచ్చేశాము ఇక తన్నుకు చావండి” అన్న చందంగా ఉందని ఏద్దేవా చేసారు.
గౌరవ ఆపద్ధర్మ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇప్పటివరకు లక్ష ఇరవై ఎనిమిది వేళా రెండు వందల డెబ్భై నాలుగు (1,28,274)  ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిందని చెప్పడం తో బాటు మరో ఆపద్ధర్మ మంత్రి కే టి రామ రావు సైతం 32 వేల ఉద్యోగాలిచామని ఉత్తర ప్రగల్బాలు పలకడం  విడ్డూరం.  దీనిలో కనీసం పావు వంతు ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించినా నిరుద్యోగుల దుస్థితి కొంతైన మెరుగుపడేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా నిరుద్యోగ యువత కదం తొక్కి రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగు విధంగా గుణపాఠం చెప్పే రోజుఆసన్నమైందని దత్తాత్రేయ హెచ్చరించారు.
Tags:Confusion in TSPSC exams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed