క‌రోనా వైర‌స్ మార్గ‌ద‌ర్శ‌కాల్లో గంద‌ర‌గోళం

Date;17/09/2020

–  టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి

న్యూ ఢిల్లీ ముచ్చట్లు

క‌రోనా వ్యాక్సిన్ కోసం అంద‌రం ఎదురుచూస్తున్నామ‌ని టీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి తెలిపారు.  ఇవాళ ఆయ‌న రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ.. తాను యువ‌కుడిగా ఉన్న స‌మ‌యం‌లో దేశం మొత్తం జ‌యాబ‌చ్చ‌న్ సినిమా రిలీజ్ కోసం వేచి ఉండేద‌ని, ఈ రోజుల్లో యావ‌త్ దేశం మొత్తం వ్యాక్సిన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఆయ‌న చ‌మ‌త్క‌రించారు. ప్ర‌స్తుత ద‌శ‌లో క‌రోనా వ్యాక్సిన్ అత్య‌వ‌స‌రం అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న భార‌తీయ కంపెనీల‌కు ఎటువంటి స‌హాయం చేస్తున్నార‌న్న విష‌యాన్ని కేంద్రం తెలియ‌జేయాల‌ని ఆయ‌న కోరారు. ప‌రిశోధ‌న‌ల‌ను వేగ‌వంతం చేసేందుకు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వ్యాక్సిన్ త‌యారీ కోసం కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ క్లియ‌రెన్సులు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎలా ఇస్తున్నార‌ని ఆయ‌న అడిగారు. టీకా అభివృద్ధి చేస్తున్న కంపెనీల‌కు ఎటువంటి నిధుల‌ను స‌మ‌కూర్చుతున్నార‌ని సురేశ్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని అడిగారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఇస్తున్న మార్గ‌ద‌ర్శ‌కాల్లో చాలా గంద‌ర‌గోళం ఉన్న‌ద‌ని, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కేంద్రం, రాష్ట్రాలు పాటిస్తున్నాయ‌ని, అయితే డ‌బ్ల్యూహెచ్‌వోతో కేంద్రానికి ఉన్న అనుబంధం ఎటువంటిద‌ని, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థకు కేంద్రం ఎటువంటి రేటింగ్ ఇస్తున్న‌దో వెల్ల‌డించాల‌ని ఎంపీ సురేశ్ రెడ్డి కోరారు. కోవిడ్ యోధుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ఎటువంటి స‌హాయం చేస్తున్న‌దో చెప్ప‌లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వారి జీతాల్లో ఏమైనా బోన‌స్‌లు ఇచ్చారా అని ఆయ‌న అడిగారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఆదుకున్నామ‌ని,  ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్‌వకు ప‌ది శాతం జీతం అద‌నంగా ఇచ్చామ‌ని, సుమారు 75వేల ఉద్యోగుల‌కు ఆ బెనిఫిట్ అందిన‌ద‌ని ఎంపీ సురేశ్ రెడ్డి చెప్పారు.

 

జైలునుంచి అందోళనకారులు విడుదల

Tags:Confusion over corona virus guidelines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *