Natyam ad

కిటకిటలాడుతున్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు

సికింద్రాబాద్ ముచ్చట్లు:


సంక్రాంతి పండుగ, సెలవులను పురస్కరించుకొని నగరవాసులంతా సొంతూళ్లకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు.. వీరి రద్దీతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ల కిటకిటలాడుతున్నాయి. రైల్ లో, బస్ లో బెర్త్ ల కోసం ప్రయాణికుల తోపులాటలు, వాగ్వివాదాలతో దద్దరిల్లుతున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక రైల్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.. జూబ్లీ బస్ స్టేషన్ నుండి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు సైతం తరలివస్తుండడంతో రద్దీ నెలకొంది.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జూబ్లీ బస్ స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరగడంతో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు.

 

Tags: Congested bus stands and railway stations

Post Midle
Post Midle