బోర్డర్ లో మళ్లీ రద్దీ

విజయవాడ  ముచ్చట్లు :

 

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వారాంతం కావడంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద రద్దీ బాగా పెరిగింది. పాసులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కూడా ఇలాంటి సమస్యే ఎదురైన సంగతి తెలిసిందే.కోదాడ మండలం రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలోని రామాపురం అడ్డరోడ్డు వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఈ-పాస్‌ నిబంధనతో వాహనాలు ఎక్కువసేపు ఆగాల్సి వస్తోంది. తెలంగాణ పోలీసులు నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంతో మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. తెలంగాణలోకి ప్రవేశించేందుకు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారి-65 రామాపురం అడ్డరోడ్డుకు మాత్రమే అనుమతివ్వవడంతో వాహనాల రద్దీ గతవారం తరహాలోని పెరిగిపోయింది.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Congestion again at the Border

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *