కురబల మహాగర్జన సభను జయప్రదం చేయండి

Congratulate the Kurupala Mahagarajan Sabha

Congratulate the Kurupala Mahagarajan Sabha

Date:10/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

అనంతపురం పట్టణంలో ఈనెల 13న జరగనున్న కురబల మహాగర్జన సభలను జయప్రదం చేయాలని పుంగనూరు కురబల సంఘ ప్రతినిధులు పిలుపునిచ్చారు. గురువారం కురబల సమావేశం అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు హేమంత్‌కుమార్‌, హరినాథ్‌, గోపాల్‌, యశ్వంత్‌కుమార్‌, ఆదినారాయణ, మదనపల్లె దేశం నాయకుడు జబ్బల కుమార్‌రాజ ఆధ్వర్యంలో మహాగర్జన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ కురబల సమావేశానికి ముఖ్యఅతిధులుగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ మంత్రి హెఎం.రెవన్న, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు సమావేశానికి హాజరౌతున్నట్లు తెలిపారు. కురబల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సమావేశంలో ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కురబలు అధిక సంఖ్యలో హాజరై, మహాగర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోకరాజు, రెడ్డెప్ప, రమణ, విశ్వనాథ్‌, శేషాద్రి, నాగభూషణం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

970 ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సేవలు

Tags: Congratulate the Kurupala Mahagarajan Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *