తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మినీ మహానాడును జయప్రదం చేయండి.

Date:16/05/2018

పలమనేరు ముచ్చట్లు:

ఈనెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు మధు కళాశాల ఆవరణలో జరిగే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మినీ మహానాడును జయప్రదం చేయాలని పలమనేర్ రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగదీష్ నాయుడు కోరారు .బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి నాయకులు కార్యకర్తలు యువకులు విద్యార్థులు మహిళలు రైతులు బడుగు బలహీన వర్గాలవారు అధిక సంఖ్యలో పాల్గొని పలమనేరు నియోజకవర్గ మినీ మహానాడును జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు .ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేశ్వర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,గ్రామపంచాయతీ అధ్యక్ష, కార్యదర్శులు ,ఎంపీపీ, జడ్పీటీసీ ,సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Congratulate the Telugu Desam Party constituency mini magnate.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *