The benefits of the employment wages are the result of the efforts of Minister Peddi Reddy and MP Mithun

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌ ఉగాది శుభాకాంక్షలు

Date:24/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు మంగళవారం విడివిడిగా శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర ఉగాధి పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజలు ఎవరు కరోనా వైరస్‌ భారీన పడకుండ శ్రీ అయ్యప్పస్వామి ప్రజలను కాపాడాలని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపిలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగ ఉపాధ్యాయులకు, కార్మికులకు, రైతులకు, మహిళామా తల్లులకు , విద్యార్థిలోకానికి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి , వైఎస్సార్‌సిపి పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలతో పాటు పుంగనూరు, రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

పుంగనూరు లాక్ డౌన్ 

Tags: Congratulations to Minister Peddi Reddy and MP Mithun Ugadi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *