జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు 

Congratulations to the people of the district

Congratulations to the people of the district

Date:14/01/2019
కర్నూలు ముచ్చట్లు:
సకల భాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి కొత్త సంవత్సరంలో సరికొత్తగా జిల్లా ప్రజలందరి గుండెల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి కే.ఈ కృష్ణమూర్తి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,  జిల్లా ఇంచార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు,  రాష్ట్ర వైద్య విద్య, మైనారిటీ శాఖ మంత్రి ఎన్. ఎం.డి.ఫరూక్, పర్యాటక శాఖ మంత్రి భూమా  అఖిల ప్రియ, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సోమవారం  ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్త పంట చేతి కొచ్చి రైతులందరు ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారని, సనాతన సంప్రదాయాలను గుర్తుకు తెచ్చి, అల్లుళ్ళు, బంధుమిత్రులతో సరదాగా చేసుకునే పండుగ సంక్రాంతి అన్నారు.  ఈ సంవత్సరంలో సమృద్ధిగా  వర్షాలు  కురిసి పంటలు బాగా పండాలన్నారు.  జెడ్పీ చైర్మన్ మల్లెల రాజ శేఖర్, ఎంపీలు టి.జీ. వెంకటేష్, బుట్టా రేణుక, జిల్లాలోని అందరూ ఎం.ఎల్.సీలు, శాసన సభ్యులు,  ఎస్.పి. పక్కీరప్ప,  జే. సి పఠాన్ శెట్టి రవి  సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు తమ శుభాకాంక్షలు తెలిపారు.
Tags: Congratulations to the people of the district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *