తెరాస ను ఓడించిన ప్రజలకు అభినందనలు మందకృష్ణ  మాదిగ

తెరాస ను ఓడించిన ప్రజలకు అభినందనలు

మందకృష్ణ  మాదిగ
హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణ ఎన్నికల్లో  నియంతృత్వ,  అహంకార, కుటుంబ బీఆర్ఎస్  ను ముక్తకంఠంతో ఓడించారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఊపిరి పోసుకున్నదని ఎమ్మార్పీఎస్అధినేత మంద కృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.  తెరాస ను ఓడించిన ప్రజలకు అభినందనలు. ఎన్నికలలో మాదిగ లు  వర్గీకరణ, కేసీఆర్ పాలనలో అణిచివేత, సామాజిక న్యాయం ను బతికించడం కోసం మాదిగలు ఓటు ను వినియోగించుకున్నారు.బీఆరెస్  ను ఓడించే ప్రయత్నం లో కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. ప్రజాస్వామ్యన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిరక్షించాలని కోరుతున్నామని అయన అన్నారు.
బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్య 2%  ఓట్లు మాత్రమే.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ కు కట్టుబడి పాలన చేయాలి. కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలుగా  ఒక మాదిగ కు కూడా అవకాశం ఇవ్వలేదు,  ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని అందుకే బీఆర్ఎస్  కి ఓటు వేయొద్దని ప్రతి సభలో చెప్పుకుంటూ వచ్చాము. జాతీయ పార్టీ  బీజేపీ వైపు మద్దతు ఇవ్వడానికి మా మాదిగల భవిష్యత్ దృష్టా నిర్ణయం తీసుకున్నాం. యూపీయే  ప్రభుత్వం వర్గీకరణ విషయం లో మోసం చేసింది… ప్రతి పక్షము లో ఉంది కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదు…  సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ మాదిగలకు సీట్లు తగ్గించి ఇచ్చింది. కాంగ్రెస్ మాల లను అక్కున చేర్చుకుంటాది. కేంద్రంలో  మోడీ ప్రభుత్వం మమ్ములను అక్కున చేర్చుకుంది. మోడీ ప్రభుత్వం ద్వారానే వర్గీకరణ జరుగుతాది అనే నమ్మకం మాకు ఉన్నది… అందుకే బీజేపీ కి మద్దతు ఇచ్చామని అన్నారు. బీజేపీ అభ్యర్థులకు స్టేట్మెంట్ కె పరిమితం కాకుండా జెండాలు పట్టుకొని  ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రచారం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ s మధ్య లోపాయికర ఒప్పందం ఉంది అని ప్రజలు విశ్వసించారు. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగించడం, లిక్కర్ కేసు లో కవిత ను అరెస్ట్ చేయకపోవడం అనే అంశాల వల్ల లోపాయికార ఒప్పందం అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిందని అయన అన్నారు.

 

Tags: Congratulations to the people who defeated Teresa Mandakrishna Madiga

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *