రాజ్ భవన్ ముట్టడించిన కాంగ్రెస్

Date:19/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు నిచ్చింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వాహించాలని తెలిపింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్‌ వద్ద ముందుగానే భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. లుంబినీ పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు ప్రదర్శనగా వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే కాంగ్రెస్‌ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవన్నారు పోలీసులు. లుంబినీ పార్క్‌ వద్ద పలువురు నేతలను అరెస్టు చేశారు.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట కూడలి, రాజ్‌భవన్‌వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

కార్పొరేట్ వ్యవసాయానికి మార్గం : రాహుల్

దేశం అత్యంత విషాద పరిస్థితుల్లో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం నలుగురైదుగురి చేతుల్లోనే నడుస్తోందని ఆరోపించారు. ఎయిర్ పోర్టులు, విద్యుత్, టెలికాం రంగాల్లో వారి ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు వ్యవసాయ రంగంపైనా వారి కన్ను పడిందని అన్నారు. మంగళవారం ఆయన ‘వ్యవసాయం ఖూనీ’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.దేశ వ్యవసాయ రంగాన్ని సాగు చట్టాలు నాశనం చేస్తాయని మండిపడ్డారు. దేశమంతా క్రోనీ క్యాపిటలిస్టుల (ఆశ్రిత పెట్టుబడిదారులు) చేతుల్లోనే ఉందని, వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. వారికి మీడియా మద్దతును ఇస్తోందన్నారు.సాగు చట్టాలతో మార్కెట్ వ్యవస్థ నాశనం అవుతుందని, నిత్యావసర సరుకుల చట్టాన్ని తుంగలోకి తొక్కేస్తుందని ఆరోపించారు. అంతేగాకుండా రైతులు తమ హక్కులను కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్లకుండా కూడా వ్యవసాయ చట్టాలు అడ్డుకుంటాయన్నారు. చట్టాలతో రైతులకు మద్దతు ధర లభించదన్నారు.ఈ చట్టాల వల్ల వ్యవసాయం మొత్తం ఆ నలుగురైదుగురు వ్యక్తుల చేతుల్లోకే వెళ్తుందన్నారు. కొన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని క్రోనీ క్యాపిటలిస్టులే నిల్వ చేసుకుంటారని రాహుల్ ఆరోపించారు. దాని వల్ల మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని, ధరలు ఊహించనంతగా పెరుగుతాయని హెచ్చరించారు. ఈ గుత్తాధిపత్యానికి తెర దించాల్సిన అవసరం ఉందన్నారు.పంజాబ్, హర్యానా రైతులు దేశభక్తులని, ఈ దేశ బతుకుదెరువును కాపాడేందుకు పోరాడుతున్నారని అన్నారు. ప్రజల కోసమే రైతులు పోరాటం చేస్తున్నారని, వారికి అందరూ మద్దతునివ్వాలని రాహుల్ కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: Congress besieges Raj Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *