గవర్నర్ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు

న్యూఢిల్లీ ముచ్చట్లు:


దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న ధరలతో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదంటూ సామాన్య, మధ్యతరగతి వారు తీవ్ర ఆవేదన చెందుతారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, ఇలా ప్రతిదీ ధరలు పెరుగుతూనే ఉంది. దీనికి తోడు పెరుగుతున్నద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 5న భారీగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని పార్టీ నేతలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపై నిరసన గళం వినిపించేందుకు కాంగ్రెస్ ఎంపీలు చలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ నుంచి  రాష్ట్రపతి భవన్ కు చేరుకొని అక్కడ నిరసన తెలపనున్నారని తెలిపింది. అనంతరం CWC సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు  ప్రధాని మోడీ నివాసానికి చేరుకుంది.. పీఎం హౌస్ ఘెరావ్’ నిరసన మార్చ్ నిర్వహించనున్నారని పేర్కొంది.ఆయా రాష్ట్రాల్లో ‘రాజ్ భవన్ ఘెరావ్’ నిరసన ప్రదర్శనను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ల నివాసాలను కాంగ్రెస్ నేతలు చుట్టుముట్టి నిరసన తెలుపుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు.జూలై 18న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో ధరలు, జీఎస్టీ అంశాన్ని కాంగ్రెస్ నేతలు లేవనెత్తాతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుదలపైప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు తమ నిరసన గళం వినిపించారు. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలుపుతున్నారు. దీంతో సభాకార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ.. వివిధ పార్టీలకు చెందిన ఉభయ సభల ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక లోక్‌సభలో సోమవారం ధరల పెరుగుదలపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. తర్వాత మంగళవారం రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది.

 

Tags: Congress calls for siege of Governor’s offices

Leave A Reply

Your email address will not be published.