సూరయ్యపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం

Congress campaign in Suraiyapalli village

Congress campaign in Suraiyapalli village

Date:26/11/2018
మంథని ముచ్చట్లు:
మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామంలో ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు జాక్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారి తరపున ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పథకాలు, పనులను చూసి చేతి గుర్తుకు ఓటు వేసి మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు గారిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లలకి నిరుద్యోగ భృతి కింద 3 వేల రూపాయలు వస్తాయని చెప్పారు. అలాగే మంథని నియోజకవర్గం లో ఉన్న అన్ని మండలాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఓయు విద్యార్థులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్ణ కృష్ణ, రేపాక శ్రీను, యువత అధ్యక్షుడు భీముని సామి, మాజీ ఉపసర్పంచ్ వెంకన్న, ఆరేళ్ల కిరణ్, మాజీ వార్డు సభ్యులు, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:Congress campaign in Suraiyapalli village

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *