పెద్ద దోర్నాల లో కాంగ్రెస్ సంబరాలు

ఒంగోలు ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని స్థానిక నటరాజ్ సెంటర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సందర్భంగా పెద్ద దోర్నాల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుచిట్యాల శ్రీకాంత్ రెడ్డి, షేక్ రసూల్, కొటారు కొండయ్య, ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్ని అంటాయి, ఈ సందర్భంగాకాంగ్రెస్ నాయకులు స్థానిక బస్టాండ్ సెంటర్లో గల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించిన అనంతరం బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు, ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఓబీసీ చైర్మన్ డీకే మస్తాన్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సొంటి శ్రీనివాసరెడ్డి, ఒద్దుల చంద్రశేఖర్ రెడ్డి, చిట్యాల వెంకట్రామిరెడ్డి,  జెడ్డా పోలురాజు, జడ్డాయోహన్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Congress celebrations in big dornas

Post Midle
Post Midle