కాంగ్రెస్ చలో రాజ్ భవన్..అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆదాని షేర్ల కుంభకోణంలో ప్రజా సంపద ఆవిరి అయ్యిందని, కాంగ్రెస్ నేతలుఆరోపించారు. ఈ విషయంలో సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని, పార్లమెంట్ కమిటీ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేసారు.
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ఛలో రాజభవన్ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ భవన్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ తో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రదర్శనతో చలో రాజ్ భవన్ ప్రారంభం అయింది. భారీ ప్రదర్శనగా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు కదిలారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. వారిని పిజెఆర్ స్టాచ్యూ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, నాయకులు పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి తదితరులు పాల్గోన్నారు.
Tags;

Congress Chalo Raj Bhavan..Police blocked
